అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి

అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి..అంబేద్కర్ అందరివాడు…అన్నే చిట్టిబాబు,శీలం రాజు,దాసరి రంగనాథ్,పులిపాక కిషోర్ .

కామయ్యతోపు అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డిసెంబర్ 6న అనగా ఈ రోజున 64వ వర్ధంతి సందర్భంగా దాసరి రంగనాథ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులు అన్నే చిట్టిబాబు,శీలం రాజు లు మాట్లాడుతూ…ఈ రోజు భారతదేశపు అణగారిన వర్గాల, ఆశాజ్యోతి , హక్కుల నేత , దేశపు మొట్టమొదటి న్యాయశాఖామంత్రి , రాజ్యాంగ నిర్మాత , ప్రజాస్వామ్య భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశించిన , భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివిధ రకాల వివక్షకు వ్యతిరేకంగా నిత్యపోరాటంలో గడిపి , బడుగుబలహీనుల , స్త్రీల హక్కుల కోసం జీవితాన్ని ధారబోసిన నిత్య కృషీవలుడు , అలసి ఆఖరిశ్వాస వదిలి నేటితో అరవై నాలుగేళ్ళు . ఇన్నేళ్ళ భారతదేశం , ఇన్ని వైరుధ్యాలూ విభిన్నతలూ గల ఈ దేశంలో పేద,ధనిక తేడాల్లేకుండా అందరికీ ఓటు హక్కును తేవడం దగ్గర్నుండి , చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానం అనే తిరుగులేని హక్కును ఈ దేశపౌరులందరికీ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన మహామనీషిని కేవలం దళిత సమూహాల ప్రతినిధిగా కొందరు కుట్రపూరితంగా ప్రచారం చేశారుగానీ , నిజానికి ఆయన అందరివాడు , విశ్వమానవుడు అన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.పి సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అన్నే చిట్టిబాబు , దళిత అభ్యుదయ సేవ సమితి కన్వీనర్ శీలం రాజు , ప్రముఖ హైకోర్టు న్యాయవాది అవిర్నేని శ్యాంసుందర్ , మాల యువత దాసరి రంగనాథ్ , ఎమ్మార్పీఎస్ కన్వీనర్ పులిపాక జయకిషోర్ , పులివర్తి రమేష్ , గోగులమూడి నాగరాజు , వల్లూరి సంసోను , సైకిల్ షాపు రాజు , దగాని శ్రీను , బొడ్డు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు .ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking