అమకతాడు టోల్ ప్లాజా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

రైతుల వ్యతిరేక వ్యవసాయ చట్టాలను-మరియు విద్యుత్ బిల్లులను ఉపసహరించుకోవాలని అమకతాడు టోల్ ప్లాజా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కర్నూల్
జిల్లా కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ రంగా నాయుడు ఆధ్వర్యంలో అమకతాడు టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ చర్చలకు పిలువకుండగా పూర్తిగా రైతులకు అన్యాయం చేసేటట్టు చట్టాలు తీసుకొస్తున్నారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని తెలిపారు అదేవిధంగా 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. అదేవిధంగా జాతీయ నాయకుల పిలుపు మేరకు అన్ని టోల్ ప్లాజా వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వెల్దుర్తి..

Leave A Reply

Your email address will not be published.

Breaking