జనగామ జిల్లా,పాలకుర్తి మండలకేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత మంగళవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు గర్భగుడి తలుపులు దేవస్థానం ఉద్యోగులు తెరవలేదు. ఉదయం 7 గంటల వరకు కూడా పూజారి రాకపోవడంతో స్వామివార్లకు ప్రాతఃకాల పూజ జరగ లేదు. ఆరోజు దేవస్థానంకి పోయినా అయ్యప్ప స్వాములు ఫోటోలు తీయడం తో వాట్సాప్ గ్రూపులో వైరల్ గా మారాయి. ఈరోజు గురువారం ఉదయం మళ్ళీ అయ్యప్ప స్వాములు పోగు శ్రీనివాస్, చెన్నూరి సోమనర్సయ్య, బాల గాని యాదగిరి, రాపోలు లక్ష్మణ్ లు వెళ్లారు. “పూజారి డి.వి.ఆర్.శర్మ రూపాయలు 500/- టికెట్ తీసుకుంటేనే పైకి అనుమతిస్తామని.. దేవస్థానంలో ఫోటోలు తీయడానికి మీరెవరు..? నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా..?”అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పలను శివునికి అభిషేకాలు చేయకుండా అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అయ్యప్ప మాలలో ఉన్న స్వాములను శివుడికి అభిషేకం చేయకుండా అడ్డుకోవడం అవమానకరం.డ్యూటీ సరిగా చేయకుండా పూజారి స్వాములను బెదిరించడం విడ్డూరం. ఈవో వీరస్వామికి జరిగిన విషయంపై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు.రిపోర్టర్:జి.సుధాకర్..