ప్రతి సోమవారం నిర్వహించే స్పందన ” కార్యక్రమములో భాగంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్ధ్ కౌశల్, ఐపీఎస్ గారితో తమ సమస్యలు చెప్పుకోవాలని భావించేవారు, ఒంగోలు వెళ్లలేని లేదా వెళ్లడానికి వీలుకాని పిర్యాదిదారులు, అదే రోజు మధ్యాహ్నం 2.30 నిమిషాల నుండి 4.00 గంటల మధ్య లో అర్ధవీడు పోలీస్ స్టేషన్ కి వచ్చి, అక్కడి నుండి స్వయంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ కౌశల్ గారితో నేరుగా మాట్లాడి, తమ సమస్యలు తెలుపవచ్చు.అట్టి పిర్యాదులు నేరుగా జిల్లా ఎస్పీ గారికి ఇచ్చినట్లుగానే భావించి రసీదు ఇవ్వబడుతుంది. అలాగే వాటి పరిష్కారానికి చట్టరీత్యా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా హాజరుకాలేనివారు “స్పందన బియాండ్ బోర్డర్స్” కార్యక్రమం ద్వార ఎస్పీ గారితో మాట్లాడి, తమ సమస్యలు తెలిపి పరిష్కారం పొందవచ్చును.ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరడమైనది…
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అర్ధవీడు పోలీస్ స్టేషన్.
Prev Post