ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన తూప్రాన్ సీఐ రంగా కృష్ణ , ఎస్ఐ శివానందం.

 

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

ప్రతి డ్రైవర్ తమ ఆటోలలో ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదన్నారు. మత్తు పానీయాలకు దూరంగా ఉండి తమ కుటుంబ పోషణకు దోహదపడాలన్నారు. డ్రైవర్లు కొంతమంది పరిమితికి మించి ఒక్క ఆటోలో 10 నుండి 15 మంది ప్రయాణికులను చేరవేస్తున్నారని ఇది చట్టరీత్యా నేరమన్నారు. యువత నేడు మద్యం మత్తుపదార్థాలు గంజాయి డ్రగ్స్ కు లోబడుతున్నారని వాటి వల్ల ప్రాణహాని తప్ప మనకు మేలు జరగదన్నారు. ఇప్పటినుండి అయినా మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మన కుటుంబ పోషణను మెరుగుపరచుకోవాలని మెదక్ తూప్రాన్ సీఐ రంగా కృష్ణ,
ఎస్సై శివానందం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లతో పాటు తూప్రాన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking