ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈనెల 10న బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్ లో ఉదయం 11:30 గంటలకు సమావేశం ఉంటుందని నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పదాధికారులు హాజరుకావాలని కోరారు.