ఎంపిడిఓ అధికారులు, మరియు సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైయస్ జగన్ జన్మదిన వేడుకలు :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానిక పట్టణం నందు గల పాతబస్టాండ్ యందు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి మరియు ఈవో ఆర్ డి నరసింహులు, గ్రేడ్ ఫోర్ సచివాలయ సిబ్బంది కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలలో 44 కేజీల కేకును మరియు సచివాలయ వాలంటీర్ల సిబ్బంది 22 కేజీల కేకును ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చేతులమీదుగా కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము నందు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి, సమీర్ రెడ్డి, మండల ఈ ఓ ఉపేందర్ రెడ్డి, మండల ఎస్సై జి పి నాయుడు, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ ,సచివాలయ పంచాయతీ సెక్రటరీలు శ్రీనివాసులు, నవీన్ తదితర సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లు, వాలంటీర్లు, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

Leave A Reply

Your email address will not be published.

Breaking