ఎంపీడీవో ఆధ్వర్యంలో మనం- మన పరిశుభ్రత పై పరిశీలన వ్యర్థం పై పోరాటం మరియు ర్యాలీ నిర్వహణ

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామాల యందు ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి మరియు ఇ. ఓ. ఆర్.డి. నర్సింహులు ఆధ్వర్యంలో మనం -మన పరిశుభ్రత, వ్యర్థం పై యుద్ధం మరియు ర్యాలీ నిర్వహించారు. మనం_ మన పరిశుభ్రత కార్యక్రమం మండలంలో 15 రోజుల పాటు నిర్వహించబడును, ప్రస్తుతం గురువారం రోజు ఈ గ్రామాలను అధికారులు సందర్శించారు. అలాగే సచివాలయం నందు ఆఫీసు సిబ్బంది మరియు వాలంటీర్లతో సమావేశమై మనంమన పరిశుభ్రత కార్యక్రమం ప్రతిరోజు డోర్ టు డోర్ పెళ్లి ప్రతి ఒక్కరికి మనం మన పరిశుభ్రత అనే అంశం పైన అవగాహన కల్పించి ప్రతి ప్రతిరోజు శానిటైజ్ చేయవలెనని సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్లకు తెలియపరిచారు. ఈ మనంమన పరిశుభ్రత కార్యక్రమము ఏడో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించి వారికి అవగాహన కల్పించి శానిటైజ్ చేయవలెనని తెలిపాడు. ఈ కార్యక్రమము నందు వెల్దుర్తి మండల ఎంపిడిఓ ఈ వి సుబ్బారెడ్డి ఈవో ఆర్ డి నరసింహులు ,పంచాయతీ సెక్రెటరీ, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.వెల్దుర్తి ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

Leave A Reply

Your email address will not be published.

Breaking