ఎర్రుపాలెం మండలంలో శుద్ర పూజల కలకలం

ఎర్రుపాలెం మండలంలో శుద్ర పూజల కలకలం -20 రోజులుగా కొనసాగుతున్న వైనం కనిపించకుండాపోయిన మైనర్ బాలిక గుప్తనిధులు ఉన్నాయన్న అత్యాశతో ఒక కుటుంబం రుద్ర పూజలు నిర్వహిస్తూ ఓ మైనర్ బాలికను బలి ఇచ్చేందుకు సిద్ధం చేశారన్న విషయం శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. గడిచిన 20 రోజులుగా ఈ తంతు కొనసాగుతుండగా, మైనర్ బాలిక అదృశ్యం నేపథ్యంలో తల్లి ఫిర్యాదు తో ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి .మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన గద్దె నరసింహారావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని తెలిసింది. బెంగుళూరుకు చెందిన రుద్ర దేవత పూజ నిర్వహించే ఓ వ్యక్తి సూచనలతో తన ఇంట్లో నరసింహారావు సుమారు 30 అడుగుల లోతు గుంట. ను గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో తీయించాడు. ఈ గ్రామంలో లో వారి పూజలు చేస్తున్న వీరు మైనర్ బాలిక ను ఈ పూజలో కూర్చుండబెట్టి ప్రధానంగా పూజలు నిర్వహించే వారని సమాచారం. బాలికకు అనారోగ్యం ఉన్నదన్న కారణాన్ని బూచిగా చూపి దేవతా పూజలకు పరోక్షంగా వీరు వ్యవహరించారని గ్రామస్తులు చెప్పుకోవడం గమనార్హం.. కాగా 2 రోజుల క్రితం బాలిక తల్లి తమకు బంధువైన వెల్లంకి రాణి ని కూతురి ఆరోగ్యం విషయమై గుంటూరు జిల్లాలోని పెదకాకాని దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించుకుని రావాలంటూ పంపించారు. దర్శనం చేసుకుని తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న రాణి కి తన 16 ఏళ్ళ కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. ఈ విషయమై గద్దె నరసింహారావు అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో వారు* పొంతన లేని సమాధానాలు ఇవ్వడం రెండు రోజుల్లో వస్తుంది ఎక్కడికి పోతుందిలే అంటూ నమ్మించే ప్రయత్నాలు చేయడంతో అనుమానం వచ్చిన ఆమె స్థానికులతో ఈ విషయాన్ని ఆవేదనతో రోదిస్తూ పేర్కొంది. దీంతో గడిచిన 20 రోజులుగా ఇంట్లో కొనసాగుతున్న రుద్ర పూజలు విషయమై అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్న పలువురు వెల్లంకి రాణి తన కూతురు కనిపించడం లేదంటూ చెప్పడంతో సదరు బాలికను బలిచ్చేందుకు ముందస్తు పూజలు చేశారని ఆ ప్రయత్నంలో భాగంగానే బాలిక తల్లిని కాకాని కి పంపించారు అంటూ ఆరోపణల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ విషయమై అదృశ్యమైన బాలిక తల్లి వెల్లంకి రాణితో ఎర్రుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదు అందుకున్న ఎర్రుపాలెం ఎస్ఐ గోపాల్ కానిస్టేబుల్ తో కలిసి శుక్రవారం రాత్రి రేమిడిచర్ల గ్రామానికి చేరుకొని నరసింగరావు ఇంట్లో ఫిర్యాదు విషయమై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని నరసింహారావు తో పాటు కుటుంబ సభ్యులు అడ్డుకొని వారించి ఇంట్లోకి రానివ్వకపోవడం తో విషయాన్ని ఎస్ఐ ఉదయ్ కిరణ్ కు సమాచారం అందించారు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన ఎస్ఐ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన స్థలంలో పరిశీలించారు. విచారణలో భాగంగా గ్రామస్తులు కూడా వెల్లడించిన ఫిర్యాదుల నేపథ్యంలో గద్దె నరసింహారావు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం కాకాని నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెల్లంకి రాణి తన కూతురు విషయమై హడావుడి చేస్తుండటంతో, ముందస్తుగా మేల్కొన్న నరసింహారావు కుటుంబం ఇంట్లో గొయ్యి పూర్తి చేసేందుకు, పూజకు ఉపయోగించిన వస్తువులను పటాలను ఇతర సామాగ్రిని అక్కడినుంచి తొలగించడం వంటి చర్యలను చేపట్టినట్లు పోలీసులు ఆనవాళ్లు గుర్తించడం గమనార్హం. కాగా రుద్ర దేవత పూజలు నిర్వహించడం మైనర్ బాలికను ఇందుకు ఉపయోగించారని, సదరు బాలిక కనిపించకుండా పోయిన విషయం శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత వెలుగు చూసినప్పటికీ గ్రామంలో ప్రజలు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకోవడం ఆ నోటా ఈ నోటా ఈ విషయం మండలంలో చర్చనీయాంశం అయింది. కాగా కనిపించకుండా పోయిన బాలిక ఏమైంది అన్న విషయం పోలీసుల విచారణలో వెలుగుచూసే అవకాశం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్ విచారణ నిర్వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking