కరోనా దూకుడు తగ్గాకే సెట్స్ పైకి ‘వీరమల్లు’

పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ‘భీమ్లా నాయక్’ షూటింగు పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టాలని పవన్ అనుకున్నాడు. అందుకు తగినట్టుగానే క్రిష్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, పవన్ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు.

అయితే క్రిస్మస్ సందర్భంగా భార్యను తీసుకుని రష్యా వెళ్లిన పవన్, ఇటీవలే అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఈ నెల 15 తరువాత ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఆల్రెడీ గతంలో ఒకసారి పవన్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ఐసోలేషన్ లో ఉన్నారు.

ఈ ఉద్ధృతి ఈ నెలలో మరింత పెరుగుతుందనే సమాచారం ఉండటం వలన, ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశాడు. ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూసుకుని అప్పుడు మొదలుపెడదామని క్రిష్ తో చెప్పినట్టుగా టాక్. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Tags: Pavan Kalyan, Nidhi Agarwal, Veeramallu Movie, Krish

Leave A Reply

Your email address will not be published.

Breaking