కళ్యాణి ఖని ఓసి ని సందర్శించిన సింగరేణి అధికారులు

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 6 :

మందమర్రి ఏరియా జీ.ఎం జి.దేవేందర్ తో కలిసి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ ) జి.వెంకటేశ్వర్ రెడ్డి ఏరియాలోని కేకే ఓసీపీ సందర్శించి పని ప్రదేశాలు పరిశీలించడంతో పాటు ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు,
ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, కే.కే ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, కే.కే ఓ.సి గని మేనేజర్ రామరాజు , సేఫ్టీ అధికారి కుష్వా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking