కాంగ్రెస్ నాయకుడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు

వెల్దండ:చౌదర్ పల్లి గ్రామ సీనియర్ నాయకులు దొబ్బల బాల్ జంగయ్య ఆకస్మిక మరణం పట్ల శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే డా,చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏఐసిసి కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి చరవాణి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం డిసిసి అధ్యక్షులు డా,వంశీకృష్ణతో పాటు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,మోతిలాల్ నాయక్ లు బాల్ జంగయ్య భౌతిక దేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు,అనంతరం బాల్ జంగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా,వంశీకృష్ణతో(రూ,5000) పాటు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామ వెంకటయ్యలు(రూ,5000)వేర్వేరుగా వ్యక్తిగత సహాయాన్ని మృతిని భార్య నర్సమ్మకు అందజేశారు,కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తక్కళ్ళపల్లి శేఖర్,రమేష్ నాయక్,మాజీ సర్పంచులు రామచంద్రయ్య,రాములు యాదవ్,స్థానిక నాయకులు వెంకటయ్య,జగన్,బాబురావు,దశరథ్ నాయక్,రాజీవ్,వెంకటయ్య, శ్రీశైలం,యాదగిరి,బాల్ లక్ష్మయ్య,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking