మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయచట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ 22 రోజులుగా ఢిల్లీలో ఉద్యమిస్తూ 23 మంది మరణించారని వారి త్యాగాలు వృధాపోకుండా ఐక్యంగా పోరాడదామని సీఐటీయూ రాష్ట్ర నాయకులు వై.సిద్దయ్య అన్నారు.జి.ఎల్.పురంలో జరిగిన కిసాన్ జ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రైతులతో జనరల్ బాడీ సమావేశం అనంతరం కొవ్వొత్తులతో కిసాన్ జ్యోతిని వెలిగించారు.మంచికలపాడు, నేకునంబాద్,నిప్పట్లపాడు తదితర గ్రామాలలో కిసాన్ జ్యోతి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాలలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు,మండల నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు,కిస్తిపాటి కోటిరెడ్డి,నల్లూరి కోటేశ్వరరావు,ఎన్.వెంకటేశ్వర్లు,ఐ.బసవయ్య, సిఐటీయూ జిల్లా నాయకుడు పూసపాటి వెంకటరావు,మండల నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు,శీలం ఆదినారాయణ,వ్యవసాయ కార్మికసంఘం నాయకులు కంకణాల వెంకటేశ్వర్లు,వంజా చెన్నయ్య,kvps కార్యదర్శి తొట్టెంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్.ప్రసాద రావు.