క్రికెట్ టోర్నమెంట్ విజేతలను అభినందించిన తుంబూరు దయాకర్ రెడ్డి మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి లో బోడేపూడి ఫౌండేషన్ నిర్వాహకులు రాజా ఆధ్వర్యంలో జరిగిన మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ విజేతలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఆట సమైక్యతను, తెలియజేస్తుందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉందని, ఆటలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి టోర్నమెంటులను ప్రభుత్వం ప్రోత్సహించి, మంచి క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి కారేపల్లి మండలంకు 15 000/- రూపాయలు, రెండవ బహుమతి కామేపల్లి మండలం కు 8000 రూపాయలు నగదు బహుమతిని అందజేశారు. టోర్నమెంట్ నిర్వాహకులు బోడెపూడి రాజాను, మంచినీటి సౌకర్యం కల్పించిన అయ్యప్ప ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బోడెపుటి ట్రస్ట్ ఫౌండేషన్ రాజా,ఎస్సై ప్రవీణ్ రెడ్డి, కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, ఎంపీటీసీలు నల్లమోతు లక్ష్మయ్య, గబ్రు నాయక్,సునీత మద్దలపల్లి తాళ్ల గూడెం గోవిందరాల ఎంపీటీసీలు, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అజ్మీర సుశీలబాయి క్రికెట్ నిర్వహణ కమిటీ సుమన్, ఇమ్మడి రామనాథం గడ్డి కొప్పుల నారాయణరెడ్డి బొడ్డు లక్ష్మీనారాయణ మేకపోతుల మహేష్, బద్దలశేఖర్ ఇట్ట శ్రీను, చల్ల రామకృష్ణ పుల్లయ్య పలువురు ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking