గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన ….టీజేఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి
సంగారెడ్డి జనవరి 27 ప్రజ బలం ప్రతినిధి:
డి అశోక్. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా తెలంగాణ ప్రభుత్వం నియమించినందున టీజేఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు చేసి జైల్ కు వెళ్లిన తెలంగాణ రావడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన కోదండరాం సార్ ని పక్కన పెట్టిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం నాశనమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఉద్యమకారుల కోసం నిరుద్యోగుల కోసం మంచి ప్రజాపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గవర్నర్ కోట లో ఎమ్మెల్సీగా నియమించినందున వారికి కలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య లక్ష్మి ,సుకన్య స్వాతి, తదితరులు పాల్గొన్నారు.