గూళ్యంలో విషాదం అనుమానాస్పద స్థితిలో తల్లి ఇద్దరు కుమారులు మృతి

ప్రజా నేత్ర న్యూస్ ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హాలహర్వి మండలం గూళ్యం గ్రామం లో అనుమానాస్పద స్థితిలో తల్లి ఇద్దరు కుమారులు మృతి చెందారు. సబిత(35), ఇద్దరు కుమారులు నిశ్చల్(10), వెంకట సాయి(6), శనివారం ఉదయం ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారని గ్రామస్తులు చెప్పడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళితే విద్యుత్ హీటర్ షాక్ వల్లే మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తల్లి కొడుకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లి కుమారులు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ శేఖర్

Leave A Reply

Your email address will not be published.

Breaking