గోరింట గ్రామంలో ధాన్యం కొనుగోలుకేంద్రం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

శ్రీకాకుళం, పొందూరు నేడు ఆమదాలవలస నియోజకవర్గం లో పొందూరు మండలంలోని గోరింట,పరిసర గ్రామాల్లో వరి పంట సాగుచేసిన రైతులు తమ పంటను తాము అమ్ముకొనేటప్పుడు దళారుల చేతులలో మోసపోకుండా,ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తమ పంటను తమ గ్రామంలోనే అమ్ముకుని ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర రైతులకు దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలును ఈ ఖరీఫ్ పంట కాలంలో ఏర్పాటు చేస్తుంది.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు వై స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పల రమణమూర్తి (మున్నా )ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గున్న రైతులు ఇక్కడకు వచ్చిన అధికారులను ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనమంటే అధికారులు కొనటం లేదు అని దీనికి సమాధానం చెప్పాలని అధికారులు ని గట్టిగా నిలదీశారు.అధికారులు స్పందిస్తూ ప్రభుత్వం ఆదేశాలు మేరకు కొనుగోళ్లు చేపడతామని చెప్పటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఏ ఎం సి ఇంచార్జ్ సెక్రటరీ వైకుంఠ రావు,ఎ యం సి ఛైర్మన్ బాడాన సునీల్ ,వై స్ ఛైర్మన్ జరాజపు వెంకట్రావు,మండల మాజీ యం పి పి ప్రతినిధి సువ్వారి గాంధీ,పి ఎ సి ఎస్ డైరక్టర్స్ చింత కాయలు రామారావు చింతాడ ప్రసాద్ ,రాగోలు శేషు మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking