ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 27 : గోవును జాతీయ ప్రాణి గా ప్రకటించాలని మూగ జీవాల సేవ సంఘం అధ్యక్షుడు కటకం నాగరాజు అన్నారు.సోమవారం మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ మూగజీవుల సేవా ఆధ్వర్యంలో మూగజీవుల సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కటకం నాగరాజు మాట్లాడుతూ… మూగజీవి అయినటువంటి గోవు అనగా గోమాతను బంజర దొడ్డి నుండి విముక్తి చేసి బంజరు దొడ్డికి దగ్గరలో ఉన్న గోశాలకు తరలించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పదండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త ఏమనగా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బంజర దొడ్డిలో దినచర్లో భాగంగా మేత మెయ్యడానికి ఒక చేనులో తిన్న పాపానికి గోమాతను గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం బంజర్ దొడ్డిలో వేసి బందిఖానా చేసినారు ఈ వార్త ఆ నోట ఈ నోట రావడం మూగజీవుల సేవా సంఘం గమనించి బంజరు దొడ్డి నుండి విముక్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ కలియుగంలో అత్యధికంగా భారతీయులు ముక్కోటి దేవతలు గోవులలో ఉంటాయని పూజిస్తున్న గోమాతకు ఇంతటి దుస్థితి రావడం చాలా బాధాకరం ప్రజలతో పూజలందుకుంటున్న గోవుకే ఇంతటి దుస్థితి వచ్చిందంటే పూజలు పునస్కారాలు లేని మానవుల జన్మ మున్ముందు ఇంకా ఎంతటి ఘోరంగా దయనీయంగా మారబోతుందోనని విశ్వసించాల్సిన విషయం. ఎండాకాలంలో చెట్లు లేక ఎండ తీవ్రత 50 డిగ్రీలు దాటిన సంగతి అందరికీ విధితమే మానవులమంతా ఎండ వేడిమి తట్టుకోవడం కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, మనతో పూజలు అందుకుంటున్న గోవుకు మాత్రం బయట ఎలాంటి నిలువ నీడ లేకుండా కడుపునిండా తిండి లేకుండా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.గోవు గొప్పతనం గురించి ప్రజలందరికి తెలుసునని, అలాంటి గోవును జాతీయ ప్రాణిగా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని మూగజీవుల సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మూగజీవుల సేవా సంఘం అధ్యక్షులు కటకం నాగరాజు,ఉపాధ్యక్షులు సంగెం శ్రీధర్,కోశాధికారి రమణ రావు ,విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు వేముల హరిప్రసాద్, విశ్వహిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా గోసంరక్ష విభాగ్ రాజసమయ్య ,శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.