ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 16 :
మందమర్రి పట్టణలోని బాలాజీ స్వీట్ హౌస్ స్థాపించి 38 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ స్వీట్ హౌస్ యాజమాని అరసవల్లి బాలాజీ మాట్లాడుతూ మందమర్రి పట్టణ ప్రజలకు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మమ్మల్ని 38 సంవత్సరాలుగా ఆదరించినందుకు చాలా సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. బాలాజీ స్వీట్ హౌస్ స్థాపించినప్పటి నుండి పట్టణ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తమ వంతుగా పేదవారికి ఎన్నో రకాలుగా ఆదుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ మార్కెట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.