ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక ముగింపు పూజలు

అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు

కోసిగి లోని 9వ వార్డు శ్రీ రామ్ నగర్ ఎన్టీఆర్ కాలనీ లో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక ముగింపు పూజలు నిర్వహించారు మంగళవారం ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు బుల్లి నర్సప్ప ,పులుసు శివన్న, చెట్నీపల్లి నారాయణ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మాజీ కోసిగి మేజర్ గ్రామ సర్పంచ్ ముత్తరెడ్డి మరియు చింతలాగేని నర్సారెడ్డి మరియు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్తీక ముగింపు పూజల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు గత రెండు రోజుల నుంచి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు ఉదయం నుంచే స్వామివారికి మంగళ హారతి, పంచామృతాభిషేకం ,రుద్రాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడికల్లు తిమ్మయ్య ,పరుసయ్య నరసింహులు, గోరకల్లు ఈరేశ్,ఉప్పరి ఈరేశ్, నరసింహులు ,ఆంజనేయులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking