తూప్రాన్ ప్రజల ఆనందోత్సవాల మధ్య
అంగ రంగ వైభవంగా కన్నుల పండుగగా
సీతారాముల కళ్యాణం నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు.
తూప్రాన్, ఏప్రిల్, 3. ఎప్రిల్ 3 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ రాముల గడ్డ పై మహిమ గల స్వయంభూ గా వెలసిన శ్రీశ్రీశ్రీ సీతా రామచంద్ర స్వామి ల తిరు కళ్యాణం కోసం బుధవారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు అధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించి 2024 సంవత్సరానికి గాను నూతన కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ఘనంగా నిర్వహించడానికి అన్ని కులాల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. రాములోరి కళ్యాణానికి అన్ని తామై ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు చైర్మన్ శ్రీమతి మామిండ్ల జ్యోతీ కృష్ణ దంపతులు సమర్పించనున్నారు.
ప్రధానంగా శాశ్వతంగా నిలిచే “పల్లకి” తయారు చేయించి భోయి వారు సేవ పట్టణంలో 9 రోజులు ఊరేగించెందుకు నూతన ముత్యాల పల్లకి నీ బరువు తక్కువ ఉండేలా అల్యూమినియం స్టీల్ కోటింగ్ డిజైన్ తో తయారు చేయించి సమర్పించడానికి ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్త అంగీకరించారు. అలాగే అన్న దానం తూప్రాన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అద్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయించారు.
డెకరేషన్ ను ముత్యాల పందిరి వేయించడానికి మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ అంగీకరించారు.
అలాగే ముఖ్యంగా పూస్తే మట్టెలు చేయించి సమర్పించడానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు అంగీకరించారు.
అలాగే సాయంత్రం భక్తుల కోసం భక్తి పాటల కచేరి ఆర్కెస్ట్రా ను కౌన్సిలర్ జమాల్ పూర్ నర్శోజి అంగీకరించారు.ఈ సమావేశంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు, కౌన్సిలర్ లు కోడిప్యాక నారాయణ గుప్త , రామునిగారి శ్రీశైలంగౌడ్, పల్లెర్ల రవీందర్ గుప్త, నర్సోజీ, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కొక్కొండ దీపక్ రెడ్డి, మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు, తిమ్మాపురం నరసింహులు,బొల్లు నరేందర్ ,తాటి విఠల్,నాగులు, బాయ్ కాడి వేంకటేశ్, మహేష్,
దుర్గా రాజు యాదవ్,
తూప్రాన్ పట్టణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పసుల నర్సింగ్ రావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రాములు.
మాజీ ఎంపిపి గుమ్మడి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివ్వమ్మ, పుర ప్రముఖులు కొక్కొండ లింగారెడ్డి, బాధే వాసుదేవ్, పట్లూరి రవీందర్ పటేల్, పల్లెర్ల బాలేశ్ గుప్త, ఉప్పల నరసింహులు గుప్తా, మామిండ్ల శ్రీనివాస్ , అనీల్, బొల్లు నరేందర్, ఏర్పుల లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, గడ్డం ప్రశాంత్ కుమార్, చంద్రయ్య, యాదగిరి, వెంకటేష్ యాదవ్, నర్సింగరావు, శ్రీనివాస్ గుప్త లతోపాటు అన్ని కుల సంఘాల నాయకులు సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.