జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న తూప్రాన్ ఎస్సై శివానందం

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్న ఎస్ఐ శివానందం , మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలలోనే ఎన్నో కేసులు ఛేదించి పట్టణ, మండల పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్య తెలిపిన సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం మార్గం చూపుతూ ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదాని శివానందం నిజం చేస్తూ ఒక పోలీస్ గా కాకుండా తూప్రాన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజల పట్ల ఎంతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో తూప్రాన్ మండల ఎస్సై శివానందం ఒక మంచి గుర్తింపు పొందారు, గతంలో ఉన్న కేసులను కూడా చేదించి ఉన్న అధికారుల ప్రశంసలు కూడా పొందుతున్నారు, ఈ క్రమంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా , జిల్లా ఎస్పీ బాలస్వామీ , జెడ్పీ చైర్మన్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం అవార్డు అందుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూప్రాన్ పోలీస్ స్టేషన్ తనకి ఎంతో బంధం ఏర్పడిందని తన స్టేషన్ కి వస్తున్న ప్రజల పట్ల సున్నితంగా వ్యవహరించి వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేయడమే తన లక్ష్యమని వివరించారు, ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం అవార్డు అందుకున్నందుకు తనకు ఎంతో సంతోష పరుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking