జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా.పాల్వాయి హరీష్ బాబు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని ప్రజా కార్యాలయంలో INTUC సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా గారిని సన్మానించిన RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్&సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా.పాల్వాయి హరీష్ బాబు.బాబర్ సలీం పాషా గారు మాట్లాడుతూ INTUC తరపున ఎస్పియం కార్మికుల తరపున ఎస్పియం కార్మికులపై జరుగుతున్న అన్యాయాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఎస్పియం పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి వారి పక్షాన పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మైనార్టీ జిల్లా చైర్మన్ యునుస్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్లు దేశ్ ముఖ్ శ్రీనివాస్, షబ్బీర్ మరియు కార్మికులు మురళి, ప్రకాష్, వెంకట స్వామీ, వెంకటేశ్, తిరుపతి, భూపాల్ రావ్, ఆంజనేయులు, సునీల్ సింగ్, వెంకటేశ్వర్లు, అశ్విన్ కుమార్ సింగ్, భూమయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు….ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్  ..

Leave A Reply

Your email address will not be published.

Breaking