కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా కొత్త ప్రకాశ్ ను 2024-2026 సంవత్సరాల పదవి కాలానికి గాను ఆర్గనైజింగ్ సెక్రటరీ గా కొత్త ప్రకాశ్ ను జిల్లా అధ్యక్షులు కన్న కృష్ణ నియమిస్తూ నియామక పత్రం తొడుపునూరి తిరుపతి ద్వార బుదవారం అందచేసారు. తన నియామకానికి సహకరించిన అద్యక్షులు కన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి వేంకటేశం, కోశాధికారి పడమటింటి శ్రీనివాస్, అవోప రాష్ట్ర సలహా దారుడు గంజి స్వరాజ్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సంఘ అభివృద్ధి కి కృషి చేస్తానని ప్రకాశ్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి లు పీవి రాజ్ కుమార్, బెతి మహేందర్ రెడ్డి, జిల్లా అవొప అధ్యక్ష, కార్యదర్శులు పివి రామకృష్ణ, కొండూరి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఎస్ జనార్ధన్ గౌడ్, యన్ నరేందర్, జి శ్రీనివాస్ గౌడ్, కె శ్రవణ్ కుమార్, డివి రమణ, జి విలాస్ రావ్, కె నర్సింహ రెడ్డి, వేణు గోపాల్, కె పర్షరాములు, శ్రీనివాస్ తదితరలు కొత్త ప్రకాశ్ నియామకం పట్ల అభినందనలు తెలిపారు.