భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు కోటపోలూరు లో భాజపా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు మేజర్ పంచాయతీలో జిల్లా భాజాపా ఉపాధ్యక్షులు ఆరణి విజయ భాస్కర్ రెడ్డి తనయుడు భాజపా యువ నాయకులు ఆరణి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి పురస్కరించుకుని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ప్రపంచ రాజ్యంగా లను వడపోసి భారత దేశ రాజ్యాంగం ను రూపకల్పనచేసి రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు దేశ సంపద అని కొనియాడుతూ వార్డ్ మెంబర్,సర్పంచ్,MPTC,ZPTC లు,MLA, MP ,మంత్రులు, IAS, IPS అవుతున్నారు అంటే అంబేత్కర్ నిరావధిక కృషి అంటూ పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు భాజపా నాయకులు . ఈ కార్యక్రమంలో బూరగ మనోహర్, సోమశేఖర్ రెడ్డి, నారపరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి, వెలుగు శ్రీనివాసులు వేలూరు రామయ్య ఆవల హరి,మస్తాన్..