డిప్యూటి తహశీల్దార్లుగా నియామక పత్రాలను కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణాజిల్లాలో రెవెన్యూ తాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 29 మందికి డిప్యూటీ తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు.మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశ మందిరంలో పదోన్నతి పొందిన 29 మందికి డిప్యూటి తహశీల్దార్లుగా నియామక పత్రాలను కలెక్టర్ ఇంతియాజ్ వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా.కె. మాధవిలత, ఎల్ శివశంకర్, కె. మోహన్ కుమార్, డిఆర్వో యం, వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసరావు, ఎస్ సి కార్పొరేషన్ ఈడి మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking