తిరువూరు మండల పరిధిలోని రెవెన్యూ గ్రామాలలో అక్టోబర్ మరియు నవంబర్ నెల మొదటి భాగం లో పట్టాదారు పాసుపుస్తకాలు కొరకు అర్జీ దాఖలు చేసిన వారి అర్జీలు తిరువూరు తహసీల్దార్ వారిచే ఆమోదించబడిన తరువాత చెన్నై ప్రింటింగ్ ప్రెస్ యందు ముద్రించబడి పోస్ట్ ద్వారా 62 పాసు పుస్తకములు తహసీల్దార్ వారి కార్యాలయం నకు వచ్చినవి.సదరు పాసు పుస్తకం కార్యాలయం నకు వచ్చి తీసుకోవాల్సిందిగా సంభందిత రైతులకు కార్యాలయము నుండి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాము..కావున పట్టాదారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా కార్యాలయము నకు వచ్చి పాసు పుస్తకం తీసుకొనవలసినదిగా తెలియ పరచతమైనది.