థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోస్టర్ ను విడుదల

తూర్పు గోదావరి జిల్లా థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12 మరియు 13వ తేదీలలో రాజమండ్రిలోని SKVT డిగ్రీ కళాశాలలో జరగనున్న జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోటీలకు సంబంధించిన పోస్టర్ ను థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా చైర్ పర్సన్, గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు అల్లవరం మండలం మొగళ్లమూరులో, థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తూర్పు గోదావరి జిల్లా గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ సభ్యులు కొండేటి చిట్టిబాబు గారు,అధ్యక్షులు బి.చంద్రశేఖర్ జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోటీలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. జిల్లా జాయింట్ సెక్రటరీ జి. సురేందర్ మామిడికుదురు జిమ్ కోచ్ ఎన్.మురారి,ప్రకాశ్ పాల్గొన్నారు.క్రీడాకారులు తమ ఆధార్ కార్డు,స్టడీసర్టిఫికెట్,ఫోటోలు-2 పాస్ పోర్ట్ సైజ్, 12వ తారీకు ఉదయం 10 గంటల లోపు పెరు నమోదుచేయించుకోవాలని జిల్లా జనరల్ సెక్రటరీ బి.మధుకుమార్ తెలిపారు.ప్రజానేత్రే రిపోర్టర్ చందు.

Leave A Reply

Your email address will not be published.

Breaking