పోలీస్ వారి సూచనలు పాటించండి
సోషల్ మీడియాలో మీ లొకేషన్,ట్రావెల్స్ ప్లాన్స్,ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి
స్వీయ రక్షణ కు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకోవటం మంచిది
1000 రూపాయల సిసి కెమెరా లక్షల విలువ చేసే ఆస్తులను కాపాడుతుంది
ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకి,డయాల్ 100 కి సమాచారం అందించాలి
పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
రామగుండం కమిషనరేట్ పోలీసుశాఖ హెచ్చరిక
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 : దసరా పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకి,విహార యాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల, కాలనీ,ఆపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సమయం లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరు అని తెలిపారు.ప్రజలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసుల సూచనలు చేశారు.