ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణ పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ పట్టణంలోని బాలల సదనంలోసమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సట్టి సాయన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగుల హక్కులను హరించిందని మండిపడ్డారు.రాష్ట్ర మంత్రి సీతక్క ఆమె మేరకు 6000 పెన్షన్ మంజూరు చేయాలనిఅలాగే బ్యాక్లాగ్ పోస్టులు,ఇలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు, దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలన్నారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంఘ భవనం ఏర్పాటు చేయాలన్నారు. 2016 వికలాంగుల చట్టం అమలు చేయాలనిడిమాండ్ చేశారు.ఇందులో ఇసాక్ అలీ,క్రాంతి కుమార్,ముత్యం, వెంకటేష్,మధుకర్, సాయన్న,సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.