నష్టపోయిన పంటలను సందర్శించిన మాజీ శాసనసభ్యులు శ్రీ నల్ల గట్ల స్వామి దాసు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు. ఈ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు తిరువూరు మాజీ శాసనసభ్యులు శ్రీ నల్ల గట్ల స్వామి దాసుగారు తుఫాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు సందర్శించడం జరిగింది . ప్రభుత్వం ఎకరానికి 500₹ రూపాయలు ఇస్తుందని. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక రోజు కూలి మనిషి కూడా సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కనీసం ఎకరానికి 20 వేల రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టిడిపి నాయకులు జీవీ ఆంజనేయులు, రైతు సంఘాలు మరియు తదితరులు పాల్గొన్నారు..!!

Leave A Reply

Your email address will not be published.

Breaking