ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010 నిబంధనల పై కలెక్టర్ జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలని సూచించారు.తగిన అర్హతలు లేకుండా వైద్యం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు పలు సూచనలు చేసారు. అనంతరం వైద్య శాఖ తీసుకుంటున్న చర్యలు,వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,కిషోర్ కుమార్,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.ధనరాజు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. మురళీధర్,డిప్యూటీ వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.రాజేందర్, విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, తదితరులు పాల్గొన్నారు