ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 31 : నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ కి ఎంపికైన మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట గురుకుల విద్యార్థులు సెప్టెంబర్ మొదటి వారంలో,ఒకటవ తారీఖు నుండి మూడవ తారీకు వరకు సాంగ్లి -మహారాష్ట్రలో జరగనున్న నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ 2023-24 కాంపిటేషన్స్ కి లక్షెట్టిపేట గురుకుల బాలికల కళాశాల నుండి ఆరుగురు విద్యార్థినులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ ఎం లలిత కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీ.భూమిక,ఇంటర్ మొదటి సంవత్సరము ఎంపీసీ, డీ.శాలిని,మొదటి సంవత్సరము ఎంపీసీ, కే. స్పూర్తి, ఇంటర్ మొదటి సంవత్సరము ఎంపీసీ, ఎం. స్నేహ,ఇంటర్ మొదటి సంవత్సరము బైపిసి, ఎస్. స్వాతి ఇంటర్ మొదటి సంవత్సరము బైపిసి,డి. లక్ష్మీ ప్రసన్న ఇంటర్ రెండవ సంవత్సరము బైపిసి విద్యార్థినులు ఇట్టి జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ కాంపిటేషన్ లకు ఎంపికైన వారిలో ఉన్నారన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను తనతో పాటుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే.మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ జి.మౌనిక,పి డి ఎన్.మల్లిక, పిఈటి కుమారి ఎం.మమత, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.