రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెసు పార్టీ నాయకులు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పసుల వెంకటి డిమాండ్ చేశారు. ప్రజా సామ్యంలో జర్నలిస్టులు ప్రజలకు మూల స్థంభాల్లాంటి వారని సూచించారు. ఎమ్మెల్యే చేసినా అవినీతి, భూకబ్జా లను ఉన్నది ఉన్నట్టు కథనాలు రాసిన జర్నలిస్ట్ సంతోష్ నాయక్ ను చంపుతానని బెదిరించడం సిగ్గుచేటన్నారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నరు. గతంలో మానకొండుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కార్యకర్త పై అసభ్యకరంగా మాట్లాడిన మాటలు మరవకముందే మళ్ళీ పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జర్నలిస్టు సంతోష్ ను కాళ్ళు నారుకుతనని బెదిరించడం సమాజానికి సిగ్గు చేటన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మానవత్వం మరిచి పశువుల్లా ప్రవర్తించడం బాధాకరమన్నారు. జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలను వెలికితీసి ప్రజల ముందు వుంచడం వారి వృత్తి అన్నారు. అలాంటి నీతి నిజాయితీ ఉన్న విలేకరుల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యేలు ప్రవతించడం హేయమైన చర్య అని తెలిపారు. ఇలాంటి భూకబ్జా లు,అవినీతి అక్రమాలు చేసే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో కోకొల్లలు అని పేర్గొన్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యే భాగోతం ఒక్కోరోజు బయట పడటం జరుగుతుందని విమర్శించారు. జర్నలిస్ట్ సంతోష్ పై దురుసుగా ప్రవర్తించి,చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేను వెంటనే భర్తరఫ్ చేసి అతనిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బడుగు.లింగం, న్యాత బాబు,నరేందర్ రెడ్డి,వీరేశం, మంజుర్ అలి, సాగర్, గాలిం,శ్రీను,శ్రీకాంత్,అనిల్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.
Next Post