పదవి విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 30 :

మందమర్రి ఏరియాలోని స్థానిక ఎల్లందు క్లబ్ లో శనివారం మందమర్రి ఏరియా జి.ఎం జి.దేవేందర్ అధ్యక్షతన వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం లో సాంబశివారెడ్డి, ఈ అండ్ ఎం డిపార్ట్మెంట్ (డిప్యూటీ సూపరింటెండెంట్) అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్ దామోదర్, (ఆఫీసు సుపరింటెండెంట్) గా విధులు నిర్వహిస్తు వీరు ఈనెల పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఏరియా ఉన్నతాధికారులు జ్ఞాపికను అందజేసి, శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి.ఎం జి.దేవేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారికి పదవి విరమణ అనివార్యమని అన్నారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా వారి జీవనం జరగాలని వారు అన్నారు. ఈసందర్భంగా మందమర్రి ఏరియాకు వీరు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి జి ఎం ఈ అండ్ ఎం వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, జిఎం కార్యాలయ సీనియర్ అధికారులు, హెచ్.ఓ.డీ.లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking