దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు

కంచికచర్ల మండలం : గని అతుకూరు, చెవిటికల్లు గ్రామాలలో పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలను రైతులు, గ్రామస్తులు, దేశం నాయకులు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పరిశీలించిన మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు..దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ…నందిగామ నియోజకవర్గం గని అతుకూరు, చెవిటికల్లు గ్రామాలలో పంటంతా వాలిపోయి ఈ విధంగా ఉంది. రైతు చాలా బాధలో ఉన్నాడు మరి వారంరోజులుగా ఈ పరిస్థితి ఉంటే ఏ ఒక్క అధికారి కూడా పంట నష్ట పరిహారం రాసుకోవడానికి రాని పరిస్థితి…మరి ప్రభుత్వం మేమున్నాము తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మేం కొంటాము అని రైతుకు ధైర్యం చెప్పిన పాపాన పోలేదు..ఈ క్రాఫ్ట్ బుకింగ్ ఎంత ఆషామాషీగా ఉందో రైతులు చెబుతున్నారు…ఈ సొసైటీ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కి సంబంధించిన రైతులు ఉన్నారు..ఏదైతే అమరావతిని ముంచాలని చూశారు, ముఖ్యమంత్రి గారి కడప పట్టణాన్ని ముంచారు…ఏదైతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు కుషన్ పెట్టుకొని జాగ్రత్తగా నీటిని విడుదల చేసినట్లయితే ఇవాళ లంక గ్రామాలు మునిగే వి కావు ఏటి వెంబడి ఉన్న ప్రజలను ముంచే వాళ్ళు కాదు…ఇప్పుడే రైతు చెబుతున్నాడు ఏ పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతు చెబుతున్నాడు.మినుము పంట పోయింది,మిర్చి పంట పోయింది , బొప్పాయి పంట పోయింది,అరటి పంట అయిపోయింది, వీటిల్లో ఏ పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతు చెబుతున్నాడు…ఇవాళ సమాజానికి పట్టెడన్నం పెట్టే వరి వాలిపోయి ధాన్యం మొలకెత్తే రైతుల దగ్గరకు వచ్చి మేమున్నామని ప్రభుత్వ అధికారులు చెప్పే పరిస్థితుల్లో లేరు..గ్రామాల్లో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు…ముఖ్యమంత్రి గారు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అని చెప్పారు .ఇవాళ గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల్లో రైతును పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు..అలాగే ఈ క్రాప్ బుకింగ్ లో కూడా ఏ పంట చేశారు ఏ పంట చేయలేదు అనే దిక్కు మొక్కు లేదు..ఇవాళ ఒక తాటి చెట్టు అంత లోతులో మీరు ఇసుకను దోచేయడం వలన ఇవాళ తీర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు..ఇవాళ ఈ 18 నెలల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు కానీ వ్యవసాయం యంత్రాలు కానీ ఒక్క రూపాయి అయిన ఖర్చు పెట్టావా జగన్ మోహన్ రెడ్డి…పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. గ్యాస్ ధరలు పెంచారు, ఇవ్వాళ గ్రామాల్లో కూడా రహదారులకు రోడ్ టాక్స్ వేస్తామని చెబుతున్నారు..దళారులు వచ్చి ధాన్యాన్ని 1100 కు,1200 ల కు కొట్టుకెళ్ళి పోతున్నారు ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలి, మొద్దు నిద్ర విడాలి..ఇవాళ సివిల్ సప్లై మినిస్టర్ బూతులు మాట్లాడుతున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి ట్రాక్టర్ ల మీద ఊరేగుతాడు ఇన్సూరెన్స్ కట్టమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసన తెలియజేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు అర్ధరాత్రి పూట కట్టారు…మీరు కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవాళ ఏ రైతు ఇస్తారు చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి గారికి ఉందా ప్రభుత్వ యంత్రాంగానికి ఉందా….ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఐదు రోజులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను సస్పెండ్ చేశారు..ఎవరైనా ప్రాణం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కడతారా ప్రాణం పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కడతారా?, అంటే రైతుల పట్ల, కౌలు రైతుల పట్ల మీకు ఎంత అవుతుందో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు.గ్రామాలలో దాన్యాన్ని దళారులకు చెప్పేసావ్ ధాన్యాన్ని వాళ్లు మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్లి 1800, 1900 అమ్ముకుంటున్నారు…అయ్యా ముఖ్యమంత్రి గారు మా పంట బురదలో ఉంటే రైతు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే పంటను చూడడానికి నీకు తీరిక లేదు…పెళ్ళాం పుస్తెల తాకట్టు పెట్టి మూడు రూపాయలకి, నాలుగు రూపాయల వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టి మా పంట ఈ పరిస్థితుల్లో ఉంటే పంట చూడడానికి నీకు నామోషి..దీని కోసమా ఒక్కసారి ఒక్కసారి అధికారం కావాలని అడిగింది..పండిన పంట చూడడానికి నీకు తీరిక లేదు పెళ్ళిళ్ళకి, తద్దినాలకి వెళ్ళటానికి మాత్రం నీకు తీరిక ఉంది నువ్వు మళ్ళీ యువ ముఖ్యమంత్రివి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టే వాడివి..రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే అసెంబ్లీలో కూర్చొని వెకిలి మాటలు వెకిలి నవ్వులు..ఆర్టీసీ బస్సులు పెట్టి 12 లక్షల మందిని పోలవరానికి తీసుకువెళ్తే మీకు భజన గా ఉందా..చంద్రబాబునాయుడు గారు పోలవరానికి పునాదులు తీయలేదు అని మాట్లాడుతున్నారు ఈ పోటుగాడు, ఈ పనోడు పునాదులు తీయకపోతే 2021,2022 నాటికి పోలవరం ఎలా పూర్తి చేస్తానని చెబుతున్నావు..మేము పునాదులు వేయకపోతే పోలవరంలో గేట్లు ఎలా పెడతారు అయ్యా..కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవ పరిస్థితులు మీకు తెలియాలని ఇవ్వాలా పొలాల్లోకి వచ్చి మాట్లాడుతున్నాము రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి..

Leave A Reply

Your email address will not be published.

Breaking