భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ,తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాచలంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది ప్రదర్శనలోపెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.11వ, పి ఆర్ సి ని ప్రకటించి 1 .7 .2018 నుండి అమలు చేయాలని ,70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 15 శాతం పెన్షన్ చెల్లించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లోవేవ్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం, మందులు సరఫరా చేయాలని, అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంకనూ బకాయి ఉన్న 1.1. 20 నుండి 1.7 .20 వరకు డి ఆర్ లను కూడా ఇప్పించాలని తదితర సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు మంగయ్య, కోశాధికారి నాళం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, బది రినాథ్, నాయకులు మురళి కృష్ణ, కిషన్ రావు, రామ్మోహన్ రావు, ఆదర్శ కుమార్ ,వెంకటేశ్వర్లు, త్రిమూర్తులు, రాయ నర్సు, తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్