పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న మేకల మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన గడ్డం వెంకయ్య,-సీతమ్మ, మనవరాలైన నందిని కి పుష్పాలంకరణ- ఓణీల వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పాల్గొని అక్షింతలు వేసి, కుమారి నందిని ని ఆశీర్వదించారు. కార్యక్రమం తదనంతరం యాదవులు, గొర్రెల పెంపకం దారులు మల్లి బాబు యాదవ్ ని రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం గురించి ప్రస్తావించి, రెండో విడత గొర్రెల కోసం అధికారుల ఆదేశాల మేరకు డీడీలు తీశామని, కానీ మాకు గొర్రెలు ఇవ్వకుండా బి ఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని తెలపగా అతి త్వరలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గడ్డం వెంకన్న, ఇమ్మడి రామనాథం ,గోపిరెడ్డి, వెంకటరెడ్డి కాట్రాల వీరబాబు, గడ్డం శ్రీను జల్ల శ్రీను మల్లయ్య గడ్డి కొప్పుల నారాయణరెడ్డి, కృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking