పేరపు నరేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు

జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, బంజర గ్రామంలో జనగామ జిల్లా అధ్యక్షులు పేరపు నరేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీలు ఐక్యంగా ఉండాలని దళితులపై దాడులను ఖండించారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అందులోని హక్కులను, రిజర్వేషన్లను సమానత్వాన్ని కాపాడుకునే బాధ్యత దళిత బహుజన బలహీన వర్గాల పై ఉంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచ దేశాలలో ఎంతో గుర్తింపు ఉంది.కానీ మనదేశంలో విగ్రహాలు కూల్చడం రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని ప్రభుత్వాల దురాలోచనని అన్నారు.ఈకార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking