ప్రకాశం జిల్లా ఒంగోలులో యువకుడి దారుణ హత్య..! కారణాలు ఇవే..!!

మానవ సంబంధాలు ఎటు పోతున్నాయి..!? తాత్కాలిక సుఖం.., క్షణికావేశం కోసం నిండు ప్రాణాలు తీసుకోవడం,, తీసెయ్యడం చేస్తున్నారు..! వివాహేతర సంబంధమే ఒంగోలులో ఈరోజు హత్యకు దారి తీసింది. ఒంగోలు నడిబొడ్డున మంగళవారం దారుణం జరిగింది. 23 ఏళ్ళ యువకుడిని దారుణంగా చంపడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..!! గాంధీ పార్క్ వద్ద థామస్ అనే 23 సంవత్సరాల యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి వెంబడించి వచ్చి కత్తితో పొడిచేసాడు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ యువకుడు ఒంగోలులోని సిరికళ షాపింగ్ మాల్ లో పని చేస్తుంటాడు. అదే షాపింగ్ మాల్ లో పని చేస్తున్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకి తెలిసి కొద్ది రోజులుగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి ఆ యువకుడి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఉదయాన్నే ఆ అమ్మాయి చేత థామస్ కి ఫోన్ చేయించి ఒంగోలు గాంధీ పార్కుకి రమ్మని చెప్పారు. ఆమె రమ్మని చెప్పడంతో యువకుడు వెళ్ళాడు. వెంటనే ఆమె భర్త తన చేతిలో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో యువకుడ్ని పొడిచేసాడు. అనంతరం ఇద్దరూ భార్యాభర్తలు పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. నిజానికి ఈ ఘటన జరిగిన వెంటనే ఒంగోలు ఉలిక్కిపడింది. చాలా రోజుల తర్వాత ఒంగోలులో మర్డర్ జరగడంతో కారణాలు ఏమై ఉంటాయా..? అంటూ చర్చించుకున్నారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ గారు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking