కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి అన్న గారు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పై ఆర్డబ్ల్యుఎస్ డీఈ సాంబయ్య, ఏఈ వేద స్వరూపణి అధికారులతో పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. పథకం అమలు….. నీటి సరఫరా…. నాణ్యత పరీక్షలు తదితర అంశాలపై చర్చించారు. నీటి నాణ్యత పై టెక్నీషియన్స్ పరీక్షలు చేసి చూపించారు. ఈ సందర్భంగా వై ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం అమలకు మండలానికి రూ 13 కోట్ల 63 లక్షలు మంజూరు కావడం జరిగిందన్నారు. 7 మంది సభ్యులతో కలిపి గ్రామంలోని సౌకర్యాలు గురించి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి పథకాల కోసం ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, మండల నాయకులు రామకృష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ టి. భీమయ్య, మాజీ వార్డు సభ్యులు ఈరన్న, నాయకులు పవన్ కుమార్, విఖ్యాత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ :-V నరసింహులు