ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ – లక్షేట్టిపేట్ ఆధ్వర్యంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ భవన్ వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బోనగిరి కుమార్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేశారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య లు నోట్ బుక్స్,పెన్స్,మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి చెరుకు వేణుగోపాల్,ప్రధాన సలహాదారు చీకటి తిరుపతి, ఉపాధ్యక్షులు నోవా, తిరుమలేష్,భాను,దూడ సందీప్ కుమార్,కోశాధికారి సందీప్ యాదవ్,ప్రచార కార్యదర్శి రమేష్, సలహాదారులు ఎస్ వేణుగోపాల్,పెండెం సతీష్, శ్రీనివాస్,మధు చారి,షాకీబ్, ఉదయ్,అంజలి,కిషోర్, సుధాకర్,వెంకటేష్,సత్తీష్, తిరుపతి,లక్ష్మణ్,మహేష్ ఫయాజ్,ఎం ఈ ఓ రవీందర్, ఏ ఓ ప్రభాకర్,కౌన్సిలర్స్ మెట్టు కళ్యాణి రాజు,సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking