ఫ్యాప్టో నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలి

శ్రీకాకుళం, పొందూరు ,ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన ఫ్యాప్టో నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి పూజారి హరిప్రసన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడివలసలో ఫ్యాప్టో నాయకుల అరెస్టులకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి పూజారి హరిప్రసన్న మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఖాళీలను బ్లాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలాగే వెబ్ కౌన్సెలింగ్ బదులు మాన్యువల్ పద్ధతిలో బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, సాయికుమార్, సునీత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.

Breaking