బడుగు బలహీన వర్గాల ,మహిళల ఆశ జ్యోతి మహాత్మా ఫూలే వర్దంతి

బడుగు బలహీన వర్గాల ,మహిళల ఆశ జ్యోతి మహాత్మా ఫూలే వర్దంతి ని యస్సి,యస్టీ,బీసీ,మైనారిటీ మహిళా ఐక్య వేదిక కర్నూలు జిల్లా కార్యాలయంలో ఫూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం.రాజేశ్వరి మాట్లాడుతూ ఆడవాళ్ళు రాముడిలాంటి భర్త కావాలని కోరుకుంటారు కానీ తన భార్యను అడవుల పాలు చేసి తన రాజ్యంలో స్థానం కూడా లేకుండా చేసిన రాముడు కాదు మహిళలకు ఆదర్శం.మహిళల పక్షపాతి మహిళ అభ్యున్నతికి కృషి చేసి ,తన భార్యకు చదువు నేర్పించి తన ద్వారా బాలికలకు,మహిళలకు విద్య నేర్పించి,తన భార్య సావిత్రిభాఫూలే ని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సమాజంలో చెరగని స్థానాన్ని కల్పించిన మహాత్మా జ్యోతిభా ఫూలే ని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు. స్త్రీలు విద్యావంతులు అయితేనే సామాజిక దూరాచారాలు నమ్మరు అని మొదట 1848లో బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసి,మహిళల ,బాలికల చదువు కోసం ఎంతో కృషి చేసిన మహానుభావులు మహాత్మా జ్యోతిభా ఫూలే అని ఆమె అన్నారు.దిక్కులేని పిల్లలకు,వితంతువుల కోసం అనాథశరణలయాలను ప్రారంభించి,తన భార్య సావిత్రిభా ఫూలే తో కలిసి స్త్రీ విద్య కోసం విశేష కృషి చేశారని ,1888 మే 11వ తేదీన వేలాది మంది సమక్షంలో మహాత్మా అనే బిరుదును ప్రజలే ఆయనకు ఇచ్చారు.వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం జీవితాన్ని అర్పించిన మహాత్మా జ్యోతిభాఫూలే 1890 నవంబర్ 28వ తేదీన కన్నుమూశారు.1887జులైలో మహాత్మా తన విలునామాలో బ్రాహ్మణులు కానీ,బ్రాహ్మణ అనుయాయులు కానీ తన మృతదేహాన్ని తాకరదని వాళ్ళ నీడ కూడా తనపై వాలకూడదని ఆయన పేర్కొన్నారని,అంబేద్కర్ సగౌరవంగా తన గురువుగా పేర్కొన్నారని ఇలాంటి మహానుభావుల ఆలోచన,ఆశయాల కృషి చేయాలని ఆమె అన్నారు. బీసీ జనసభ అధ్యక్షులు టి. శేషఫణి గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాలు చదువుతో బాగుపడతాయని వారికి చదువు నేర్పించడమే కాక అనేక సామాజిక మార్పుకోసం ఎంతో కృషిని చేసిన ఫూలే ని యస్సి,యస్టీ,బీసీ,మైనారిటీ ప్రజలు ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచన విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది.విజయలక్ష్మి,రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్,NYSF నాయకులు రాజేష్ మహిళ ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి సరస్వతి, దూదేకుల మాబి జిల్లా కార్యనిర్వాహకకార్యదర్శి,ఎర్రం లక్ష్మీదేవి,ప్రవీణ ,శశికళ తదితరులు పాల్గొన్నారు.మీ హరీష్ ప్రజానేత్ర రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking