బిజెపి పార్టీ లోకి చేరిన కలచట్ల మాజీ సర్పంచ్ మరియు ప్రజలు

కర్నూల్ జిల్లా ప్యాపిలి కేంద్రంలో బిజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు మరియు రాష్ట్రం లో బీజేపీ బలోపేతం అవుతున్న తీరుకు ఆకర్షితులై మండలం లోని కలచట్ల గ్రామానికి చెందిన మాజి సర్పంచ్ పుల్లన్న తనతో పాటు ముప్పై కుటుంబాలను బీజేపీ ప్యాపిలి మండల అధ్యక్షులు వడ్డే మహరాజు ఆధ్యర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వడ్డే మహరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సైనికపరమైన నిర్ణయాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రమ్మరతం పడుతున్నారని కేవలం వ్యక్తి ప్రయోజనాల కన్న దేశ ప్రయోజనాలు ముఖ్యంగా మరియు అంత్యోదయ నినాదంతో బీజేపీ ముందుకు పోతుందని భవిష్యత్ లో బీజేపీ రాష్ట్రంలో మంచి భవిష్యత్ వుందని భావించి చాలా మంది వస్తున్నారని దీనిలో భాగంగా ఈ రోజు కలచాట్ల గ్రామస్థులు అదేన్న,పుల్లన్న, నాగన్న, ఈశ్వరయ్య, రామకృష్ణ, సుమన్ సురేంద్ర తలారి రామాంజనేయులు, రామదాసు, శంకర్, కంబగిరి తదితరులు రావడం శుభపరిణామం అని వారన్నారు వీరిలో అదేన్నకు మండల ప్రధాన కార్యదర్శి గా మాజి సర్పంచ్ పుల్లన్నను మండల కార్యదర్శి గా నియమిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా డోన్ మండల మరియు పట్టణ అధ్యక్షులు హెమాసుందర్ రెడ్డి, ఆర్మీ రామయ్య, మధు పాల్గొన్నారు.
?ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking