బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్,ఆట ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

ఆట మెగా హెల్త్ క్యాంప్ అందరికీ ఉపయోగం ..asp bcm బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్,ఆట ఆధ్వర్యంలో భద్రాచలం శాంతి నగర్ లొ అనుబోస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆట మెగా హెల్త్ క్యాంప్ అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. covid 19 నిబంధనలను పాటిస్తూ ఈ పరిస్థితుల్లో ఇంత చక్కగా క్యాంపు నిర్వహణ తీరుపై నిర్వాహకుల పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ మెగాహెల్త్ క్యాంపులును జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి క్యాంప్ ను ప్రారంభించారు.భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిడెంట్ యుగంధర్ మాట్లాడుతూ ఆట నిర్వహించే సేవా కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని వాటిని మరింత విస్తృతం గా నిర్వహించాలని వ్యవస్థాపకులను కోరారు . ఈ క్యాంపస్ ద్వారా తొంభై మంది రోగులు హాజరై చికిత్సలు చేయించుకున్నారు . శ్రీ సీతారామచంద్రస్వామివారి మాజీ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు హాజరై ఎస్పీ వినీత్ , ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి యుగంధర్, మెడికల్ క్యాంపుకు విచ్చేసిన డాక్టర్లని ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో ఆట ఆర్గనైజర్లు కే.బీ.ఎస్ ఉమాదేవి ,k. వరప్రసాద్ , పోతుల రమేష్ బాబు , జీ. భూషణరావు ప్రముఖ స్థానిక లాయర్లు సాల్మన్, కొడాలి శ్రీను,భద్రాద్రి బ్యాంక్ చీఫ్ మేనేజర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking