కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే లక్ష్మీదేవి పల్లి, మణుగూరు ప్రాంతంలో కనిపించిన పులి.. తాజాగా చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తున్నది. ఇవాళ తెల్లవారుజామున పులి సంచరించిన ఆనవాలను గ్రామస్తులు గుర్తించారు. అవి పెద్దపెలి పాదముద్రలని అనుమానిస్తున్నారు. విషయాన్ని అటవీ అధికారులు తెలియజేశారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.డిసెంబర్ 14న లక్ష్మీదేవిపల్లి మండలం అనిషెట్టిపల్లి గ్రామం గుళ్లమడుగు సమీపంలో పెద్ద పులి సంచరించింది. సోమవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పులి దాడి చేసింది. అదేవిధంగా, గతవారంలో సింగరేణి మణుగూరు ఏరియా ప్రకాశం గని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పెద్దపులి సంచరించింది. సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.