భద్రాద్రి స్వరాంజలి ఆధ్వర్యంలోపాటల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం. కీ.శే.డాక్టర్ పద్మశ్రీ sp బాలసుబ్రహ్మణ్యం స్మృతి పథం లో భద్రాద్రి స్వరాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ఆన్లైన్ పాటల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఆదివారం రాత్రి స్థానిక క్రాంతి విద్యాలయం లో జరిగింది.బాలుగారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు ముఖ్య అతిథి పట్టణ ci స్వామి,itc bpl అధికారి చెంగల్ రావు,స్వరాంజలి అధ్యక్ష కార్యదర్శిలు పాకాల దుర్గాప్రసాద్, సోమరౌతు శ్రీనివాసరావు.అనంతరం sp బాలుగారి స్మృతులను స్మృతి వేదికలో అందరూ పాలుపంచుకున్నారు.భారతదేశం గర్వించదగ్గ గాయకుడు, మానవతావాది, స్నేహశీలి sp బాలు అని,ఆయన పాటలను చిన్నవారి దగ్గర నుండి ముసలివారు వరకు విని ఆనందిస్తారు అని గుర్తు చేసుకున్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు.సీనియర్ల విభాగంలో మొదటి బహుమతి ధనశ్రీ వెల్ది, కరీంనగర్
రెండవ బహుమతి బెల్లంకొండ భారతి, చిలకలూరిపేట మూడవ బహుమతి పెద్దిరాజు,మోరంపల్లి బంజర భద్రాద్రి జిల్లా  జూనియర్ ల విభాగంలో మొదటి బహుమతి లక్ష్మీ సాయి చరిత,అనంతపురం రెండవ బహుమతి అమరవాది వేదామృత వర్షిణి,భద్రాచలం తృతీయ బహుమతి.శ్రీవాత్సవ హైదరాబాద్ లకు అందించారు. అనంతరం sp బాలు పాడిన పాటలను గాయకులు పోకల శ్రీనివాస్, కొండపల్లి మహేష్,వాణిరాం, పాడి అందరిని అలరించారు.ప్రముఖులు, పట్టణ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ….భద్రాద్రి స్వరాంజలి. పాకాల దుర్గాప్రసాద్ (అధ్యక్షుడు)
సోమరౌతు శ్రీనివాసరావు(కార్యదర్శి) కమిటీ కార్యవర్గం. కొండపల్లి మహేష్
పోకల శ్రీనివాస్ తాండ్ర నరసింహారావువాణి

జోసెఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం

Leave A Reply

Your email address will not be published.

Breaking