భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేసిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్

లక్ష్మీదేవిపల్లి మరియు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ల నూతన భవన నిర్మాణాలకు ఈరోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్ గారు భూమి పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ కొరకు ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ప్రభుత్వం నుండి కేటాయించబడిన స్థలంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గారు అనంతరం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (09) పోలీస్ స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఇందులో భాగంగానే ఈ రోజు ఈ రెండు పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలకు పనులను మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య, ఎస్బి ఇన్స్పెక్టర్లు రవి,బాలాజీ చుంచుపల్లి సీఐ గురుస్వామి, కొత్తగూడెం వన్టౌన్ సిఐ రాజు, టూటౌన్ సీఐ సత్యనారాయణ, జూలూరుపాడు సీఐ నాగరాజు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ కె.ఢమరుకేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి ఎమ్మార్వో భద్రకాళి, సుజాతనగర్ ఎమ్మార్వో నాగరాజు మరియు ఎస్సైలు అంజయ్య,శ్రీనివాస్,అరుణ మరియు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్..

Leave A Reply

Your email address will not be published.

Breaking