మట్కా బీటర్లకు, సారా, రౌడీ షీటర్ లకు సీఐ ఓ. మహేశ్వర్ రెడ్డి మరియు ఎస్సై జి. పి. నాయుడు కౌన్సిలింగ్

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు మట్కా బీటర్ లకు, రౌడీషీటర్లకు ,సారా వ్యాపారస్తులకు డోన్ సిఐ ఒ.మహేశ్వర్ రెడ్డి మరియు మండల ఎస్సై జి పి నాయుడు సమావేశపరిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సమావేశం సందర్భంగా ఓ. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మట్కా బీటర్ గా ఎవరైనా ఆడిన దానికి సహకరించిన అటువంటి వారి పైన కఠినమైన చర్య ఉంటుందని తెలిపారు. సారా వ్యాపారస్తులు ఎవరైనా సారా బట్టీలు పెట్టి సారా అమ్మినా అలాంటి వారిపైన కఠిన చర్య తప్పదని మరియు రౌడీషీటర్లు గా ఎవరైనా ఉన్నా వారు ఇప్పటినుండి మార్పు కచ్చితంగా తెచ్చుకొని ప్రతి ఒక్కరూ సుఖాంతమైన జీవితం గడపండి అని తెలిపారు. ఇప్పటినుండి ఎవరైనా చెడు వ్యసనాలకు గాని పాల్పడినట్లు అయితే అలాంటి వారిపైన కఠిన చర్యలు తప్పదు అని సి. ఐ. ఓ. మహేశ్వర్ రెడ్డి మరియు మండల ఎస్సై జి. పి.నాయుడు తెలిపారు. ఈ సమావేశం నందు డోన్ సి.ఐ. ఓ. మహేశ్వర్ రెడ్డి మరియు వెల్దుర్తి మండల ఎస్సై జి .పి.నాయుడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి

Leave A Reply

Your email address will not be published.

Breaking